తుఫాన్‌పై యంత్రాంగం అప్రమత్తం
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:06 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ప్రధానంగా స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సామగ్రిని సిబ్బంది భద్రపరిచారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ప్రధానంగా స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సామగ్రిని సిబ్బంది భద్రపరిచారు.
నరసన్నపేట, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): తుఫాన్ ముంచుకొస్తున్న తరుణంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ సామగ్రి వర్షాలకు తడవకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం రక్షణ చర్యలు చేపట్టింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలకు సంబందించిన వివిధ సామగ్రి వర్షాలకు దెబ్బతినకుండా ప్రత్యేకంగా ప్యాకింగ్ చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుస్తుగా సురక్షితంగా ఉండేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి అనురాధ తెలిపారు.
ఫపాతపట్నం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): తుఫాన్ నేపథ్యంలో తహసీ ల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటుచేసినట్లు తహసీల్దార్ బి.వెంకటరమణ తెలిపారు. ప్రధానంగా ఈదురుగాలులు వీచే సమయంలో ఆరుబయటకు రావొద్దని ప్రజలను కోరారు.
ఫనందిగాం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయిలో తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వీఆర్వోలను తహసీల్దార్ పెద్దింటి సోమేశ్వరరావు సూచించారు. ఆదివారం స్థానిక తహపీల్దార్ కార్యాలయంలో తుఫాన్ ముం దస్తు చర్యలపై వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఆయనతోపాటు ఆర్‌ఎస్‌డీటీ ఆర్.రామారావు, ఉప ఎంపీడీవో టి.హరికృష్ణ ఉన్నారు.