Share News

ఆకర్షణీయంగా పట్టుమహాదేవి కోనేరు

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:03 AM

పట్టణ అభివృ ద్ధిలో భాగంగా పట్టుమహాదేవి కోనేరు సుందరీ కరణ పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని మం త్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.

ఆకర్షణీయంగా పట్టుమహాదేవి కోనేరు
టెక్కలి: కోనేరు అభివృద్ధి పనులను కలెక్టర్‌తో కలిసి పరిశీలిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

టెక్కలి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): పట్టణ అభివృ ద్ధిలో భాగంగా పట్టుమహాదేవి కోనేరు సుందరీ కరణ పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని మం త్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. బుధవారం టెక్కలి పర్యటనలో భాగంగా కో నేరు వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి కోనేరు అభివృద్ధి ప్రణాళికపై వివరణ ఇచ్చారు. అంతకుముందు కోనేరు స మీపంలోని వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించి స్వామివారికి పూజలు చేశారు. టీడీపీ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ నియమితులైన సందర్భంగా బుధవారం మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యకర్తలే పార్టీకి బలం

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): కార్య కర్తలో టీడీపీకి బలమని మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్‌ భవనంలో ఇటీవల నియమితులైన నూతన మండల కమిటీ సభ్యులు మంత్రి అచ్చెన్నాయు డును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారిని మంత్రి అభినందించారు. అనంతరం మాట్లాడు తూ పార్టీబలోపేతం, ప్రజా సమస్య పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర కళింగకోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిం దరాజులు, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, పీఏసీఎస్‌ అద్యక్షురాలు వెలమల విజయలక్ష్మి, పార్టీ మండల అధ్యక్షుడు బోయిన సత్యశ్రీనివాస్‌, నాయకులు జి.లక్ష్మణరావు, నంబాళ శ్రీనివాస్‌, పినకాన అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కుటుంబానికి ఫ్యామిలి కార్డు

త్వరలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యా మిలి కార్డు అందిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన బుధవారం స్థానిక ఎన్టీఆర్‌ భవనంలో ముఖ్యమంత్రి స హాయ నిధిద్వారా టెక్కలి నియోజకవర్గం పరి ధిలో 26 మంది లబ్ధిదారులకు రూ.23లక్షల వి లువైన చెక్కులను అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే 304 మంది లబ్ధి దారులకు రూ. 3.2 కోట్లు చెక్కులను అంద జేసినట్టు తెలిపారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యం గా పని చేస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అన్నారు. బుధవారం కురుడు- రామ య్యపేట గ్రామాలకు రూ.1.20కోట్లు వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అలాగే రామయ్యపేటలో వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ, దాసరిపేట గ్రామంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ జలజీవన్‌మిషన్‌ రక్షిత మంచినీటి పథకం శంకుస్థాపన, దంత గ్రామంలో పలు సీసీరోడ్డును ఆయన ప్రారంభించారు.

Updated Date - Apr 16 , 2026 | 01:03 AM