నవజాత శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:15 AM
నవజాత శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధ అవ సరమని, బిడ్డ పుట్టిన తొలి 28 రోజుల సంరక్షణ ఎంతో కీలకమని డీఎంహెచ్‌వో డా.నరేష్ కుమార్ అన్నారు.
డీఎంహెచ్‌వో డా.నరేష్‌కుమార్
శ్రీకాకుళం కల్చరల్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): నవజాత శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధ అవ సరమని, బిడ్డ పుట్టిన తొలి 28 రోజుల సంరక్షణ ఎంతో కీలకమని డీఎంహెచ్‌వో డా.నరేష్ కుమార్ అన్నారు. నవజాత శిశు వారోత్సవాల సంద ర్భంగా సోమవారం ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ బరువు, నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్యసేవలు అందించడంతో పాటు గృహ సందర్శనల ద్వారా వారి ఎదుగుదలను పర్యవేక్షించాలన్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు అందించాల్సిన వైద్య సేవలపై తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. నవ జాత శిశువుల్లో ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలన్నారు. కార్య క్రమంలో డీఐవో రాందాస్, డీఎస్‌వో డా.పి. సుజాత, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డా.శివ రంజని, డా.వెంకటరావు, వైద్యసిబ్బంది తది తరులు పాల్గొన్నారు.