Share News

ప్రభుత్వ పాఠశాలల్లో చేరండి

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:08 AM

బడిఈడు పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, ఎంఈవోలు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

  ప్రభుత్వ పాఠశాలల్లో చేరండి
జలుమూరు: చల్లవానిపేటలో తల్లిదండ్రులకు కరపత్రం అందజేస్తున్న ఎంఈవో, ఉపాధ్యాయులు:

బడిఈడు పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, ఎంఈవోలు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

ఫజలుమూరు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చల్లవానిపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అదే గ్రామంలో బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠ శాలలో చేర్పించాలని ఎంఈవో-2 ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అలాగే ఎంఈవో బి.మాధవరావు చల్లవానిపేట ఉన్నతపాఠశాలలో మద్యాహ్న భోజనం పరిశీలించారు. కార్యక్రమంలో సీఆర్‌ఎంటీ రవికుమార్‌, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫవజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి లో చేరాలని నగరంపల్లి హైస్కూల్‌ హెచ్‌ఎం హేమారావు కోరారు. నగరంపల్లి హైస్కూల్‌ ఉపాధ్యాయులు తమ పాఠశాలలో చేరాలని నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు, కిడిసింగి, కాశీనగర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, సాధించిన విజయాలను వివరించారు.

Updated Date - Apr 08 , 2026 | 12:08 AM