కార్యాలయాలపై దాడి హేయం
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:23 AM
మహిళలను కించపరిచే సంస్కృతి వైసీపీది, ఆ పార్టీ నాయకులదేనని మాజీ ఎంపీపీ, ఎమ్మె ల్యే కూన రవికుమార్ సతీమణి ప్రమీల అన్నారు.
మహిళలను కించపరిచే సంస్కృతి వైసీపీదే..
మాజీ ఎంపీపీ కూన ప్రమీల
పొందూరు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): మహిళలను కించపరిచే సంస్కృతి వైసీపీది, ఆ పార్టీ నాయకులదేనని మాజీ ఎంపీపీ, ఎమ్మె ల్యే కూన రవికుమార్ సతీమణి ప్రమీల అన్నారు. బుధవారం పొం దూరులో విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల పరిస్థితిని వివరించే క్రమంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ మాట్లాడిన మాటలను వక్రీకరించి ఆ సంస్థలపై వైసీపీ నాయకులు దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. మాజీ సీఎం జగన్ రెడ్డి తల్లి, చెల్లిని, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని నీచ మైన పదజాలంతో వైసీపీ నేతలు మాట్లాడితే స్పందించని ఆ నాయ కులు రాధాకృష్ణ మాటలపై రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉంద న్నారు. వైసీపీ నాయకుల మానసిక పరిస్థితిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. అంతకుముందు పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సమావేశంలో టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు అనకాపల్లి విజయలక్ష్మి, ఎంఎంఎస్ అధ్యక్షురాలు పి.అరుణ, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి బలగ శంకర భాస్కర్, ఎంపీటీసీ బాడాన గిరి, కాలెపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.