న్యాయవాదులపై దాడులను అరికట్టాలి
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:00 AM
ఇటీవల కాలంలో న్యాయవా దులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడానికి ప్రత్యేకంగా రక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాకుళం బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు కూన రాజారావు అన్నారు.
- శ్రీకాకుళం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు
శ్రీకాకుళం లీగల్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కాలంలో న్యాయవా దులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడానికి ప్రత్యేకంగా రక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాకుళం బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు కూన రాజారావు అన్నారు. అన్నమయ్య జిల్లాలో యువ న్యాయవాది పూజారి ఎల్లయ్యను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ శుక్ర వారం న్యాయవాదులు ర్యాలీ నిర్యహించారు. జిల్లాకోర్టు ముందు మానవ హారంగా ఏర్పడ్డారు. అనంతరం బార్ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ నెల 13న విధులకు గైర్హాజరు కావాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బారు అసోసియేషన్ నాయకులు సీహెచ్ సూర్యనారాయణ, సుజాత, డొంకాన ఈశ్వ రరావు, జి.సత్యభామ, ఇందిరా ప్రసాద్, న్యాయవాదులు ఆగూరు ఉమామహే శ్వరరావు, కూన అన్నంనా యుడు, సనపల హరి, భవానీ ప్రసాద్, అంపోలు సంధ్యారాణి, ఎన్ని సూర్యారావు, నీలం నాయుడు, ప్రతాప్ పాల్గొన్నారు.