Share News

న్యాయవాదులపై దాడులు అమానుషం

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:59 PM

న్యాయవాదులపై దాడులు అమానుషమని స్థానిక బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మి పేర్కొన్నారు.

 న్యాయవాదులపై దాడులు అమానుషం
నిరసన తెలుపుతున్న న్యాయవాదులు :

ఆమదాలవలస, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదులపై దాడులు అమానుషమని స్థానిక బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం పట్టణంలో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సమా వేశం నిర్వహించి అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని పాత వడ్డిపల్లికి చెందిన న్యాయవాది పూజారి ఎర్రయ్య హత్యను ఖండించారు. ఈమేరకు నిరసన తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు సీపాన గోవిందరావు, తమ్మినేని అన్నంనాయుడు, బొడ్డేపల్లి మోహన్‌రావు, సాధు ధనుంజయరావు, గరుగుబిల్లి ప్రభాకరరావు, వాడవలస రాజేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 11:59 PM