Share News

ప్రయాణికుడిపై దాడి.. నగదు అపహరణ

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:28 AM

స్థానిక పాత జాతీయ రహదారి రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఓ ప్రయాణికుడిపై మద్యం మత్తులో ఓ వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, అతడి బ్యాగులో ఉన్న నగదుతో ఉడా యించిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

ప్రయాణికుడిపై దాడి.. నగదు అపహరణ
అపస్మారకస్థితిలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి

పలాస, మార్చి 18(ఆంధ్రజ్యోతి): స్థానిక పాత జాతీయ రహదారి రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఓ ప్రయాణికుడిపై మద్యం మత్తులో ఓ వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, అతడి బ్యాగులో ఉన్న నగదుతో ఉడా యించిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఒడిశా వాసిగా అనుమానిస్తున్న బాధితుడు బ్యాగుతో రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా.. ఆ ప్రాంతంలో తిరుగాడే ఓ మందుబాబు అడ్డగించి దాడి చేశాడు. దీంతో బాధితుడు అపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత బ్యాగు, పాకెట్‌లో ఉన్న నగదుతో ఉడాయించాడు. ఈ ఘటన చూసిన వారు కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ నర్సింహమూర్తి తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి దాడి చేసిన వ్యక్తికోసం గాలిస్తున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న బాధితుడికి 108 వాహనంలో చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కావాల్సి ఉంది.

Updated Date - Mar 19 , 2026 | 12:28 AM