హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్‌పై దాడి
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:59 PM
హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ నాయకుడు రామకృష్ణపై శుక్రవారం దాడి జరిగింది.
హిరమండలం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ నాయకుడు రామకృష్ణపై శుక్రవారం దాడి జరిగింది. ధనుపురం గ్రామానికి చెందని రామకృష్ణపై అదే గ్రామానికి చెందిన కొంత మంది దాడి చేసినట్టు తెలుస్తుంది. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను కు టుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హిరమండలం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. గ్రామానికి చెందిన కొంత మంది టీడీపీ నాయకులు తనపై దాడి చేసినట్టు రామకృష్ణ ఆరోపిస్తున్నారు. గ్రామంలో బెల్టుషాపు నిర్వహిచడాన్ని ఆరు నెలల కిందట ప్రశ్నించానని, దీనిపై అప్పట్లో సర్పంచ్ ఢిల్లేశ్వరరావుకు చెప్పినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న వారే తన పై దాడికి పాల్పడినట్టు ఆరోపించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంటున్నాడు. కాగా టీడీపీ మండల అధ్యక్షుడు దారపు ఢిల్లేశ్వరరావు మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. రామకృష్ణపై దాడి టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించి కాదని, కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఘర్షణగానే అని తెలిపారు.