‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’పై దాడి అప్రజాస్వామికం
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:59 PM
ప్రజా స్వామ్యంలో నాలుగో స్తంభ మైన పత్రికల పై వైసీపీ నేతలు దాడి చేయడం అప్ర జాస్వామికమని డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అన్నారు.
ఎచ్చెర్ల, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ప్రజా స్వామ్యంలో నాలుగో స్తంభ మైన పత్రికల పై వైసీపీ నేతలు దాడి చేయడం అప్ర జాస్వామికమని డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అన్నారు. ఎస్‌ఎంపురం స్వగృహంలో మంగళవారం వారు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తల దాడి అత్యంత హేయమైన చర్య అని అన్నారు. వాస్తవాలను, రాజకీయ పరిశీలనా కథనాలను ప్రచురించే పత్రికలపై ఇలాంటి దాడులు వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. సార్వ త్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన వైసీపీ అసహనంతో ఇలాంటి దాడులకు దిగుతోందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో మింగలేక కక్కలేక మావిగాన్ పేరిట సరి కొత్త డ్రామాకు తెరలేపిన వైసీపీని ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతవుతుందని అభిప్రాయపడ్డారు.