‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’పై దాడి.. మీడియా స్వేచ్ఛను కాలరాయడమే
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:00 AM
హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి యత్నించడం మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనని జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబు అన్నారు.
హిరమండలం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి యత్నించడం మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనని జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబు అన్నారు. మంగళవారం హిరమండలంలో విలేకరులతో మాట్లాడుతూ.. మావిగన్ వంటి చౌకబారు ఆలోచనతో భంగపడ్డ వైసీ పీ నాయకులు ప్రజల దృష్టిని మరల్చే కుతంత్రమే ఆ దాడులన్నారు. ఎండీ వేమూరి రాధాకృష్ణ ముక్కుసూటిగా పీ-4 వంటి ప్రభుత్వ విధా నాలను సైతం విమర్శించిన సందర్భాలున్నాయన్న సత్యాన్ని జగన్ అండ్ కో గమనించాలన్నారు. ఆయన చేసిన విశ్లేషణను జీర్ణించు కో లేక వైసీపీ నేతలు దాడులకు దిగడం అప్రజాస్వామికమన్నారు. కార్యక్ర మంలో పీఏసీఎస్ అధ్యక్షుడు గోళ్ల సింహాచలం, టీడీపీ నాయ కులు ఎస్.గోవిందరావు, బర్రి సురేష్, కె.సింహాచలం, టి.రమేష్, పి.శ్యామల రావు తదితరులు పాల్గొన్నారు.