ఏటీఎంలు ఫుల్.. క్యాష్ నిల్
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:07 PM
ఏటీఎం.. ఎనీటైమ్ మనీ.. కానీ ఇచ్ఛాపురంలో మాత్రం ఒక్కటంటే ఒక్క ఏటీఎం కూ డా పనిచేయడం లేదు.
- ఇచ్ఛాపురంలో ప్రజలకు తప్పని ఇక్కట్లు
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి):ఏటీఎం.. ఎనీటైమ్ మనీ.. కానీ ఇచ్ఛాపురంలో మాత్రం ఒక్కటంటే ఒక్క ఏటీఎం కూ డా పనిచేయడం లేదు. జాతీయ బ్యాంకుల ఏటీఎంల్లో ఎప్పుడూ పూర్తిస్థాయిలో నగదు నిల్వలు ఉంచిన దాఖలాలు లేవు. అటు ప్రైవేటు బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలు సైతం పనిచేయ డం లేదు. దీంతో నగదు దొరకక వినియోగదా రులు, ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. గత వారం రోజులు గా ఇదే పరిస్థితి నెలకొంది. ఇచ్ఛాపురం పట్టణంలో స్టేట్‌బ్యాంక్, యూనియన్, గ్రామీణ వికాస్ బ్యాంకులతో పాటు ఇతర ప్రైవేటు బ్యాంకులు దాదాపు 10 నుంచి 12 వరకూ ఉంటాయి. వీటికి అనుబంధంగా ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. అయితే కొన్ని బ్రాంచ్‌లు పనిచేస్తున్నప్పుడు మాత్రమే అందు బాటులో ఉంటు న్నాయి. మరికొన్నింటిలో నగదు నిల్వలు ఉండటం లేదు. గత ఐదురోజులుగా ఏటీఎం కేంద్రాల్లో కొరత ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ విషయమై ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ నీల కంఠసాహును వివరణ కోరగా.. ‘మాకు పలాస ప్రధాన బ్రాంచ్, వైజాగ్ ప్రధాన బ్యాం చ్ నుంచి నగదు రాలేదు. దీంతో క్యాష్‌ను ఏటీఎంలలో జమచేయలేక పోతున్నాం. ఈ సమస్యను ఉన్నతాధికా రుల దృష్టికి కూడా తీసుకెళ్లాం’ అని తెలిపారు.