Share News

ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:52 PM

స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆదివారం అథ్లెటిక్స్‌ పోటీలకు క్రీడాకారుల ఎంపిక ఉత్సా హంగా సాగింది. జిల్లా అథ్లెటిక్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌- 14, 16,18, 20 విభాగాల్లో బాలబా లికల ఎంపికలు నిర్వహించారు.

 ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు
లాంగ్‌జంప్‌ పోటీలో పాల్గొన్న క్రీడాకారులు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆదివారం అథ్లెటిక్స్‌ పోటీలకు క్రీడాకారుల ఎంపిక ఉత్సా హంగా సాగింది. జిల్లా అథ్లెటిక్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌- 14, 16,18, 20 విభాగాల్లో బాలబా లికల ఎంపికలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు ఏడు వందల మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ ఎంపికలను వ్యాయామ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపకుడు పి.సుందరరావు, జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి ఎం. సాంబమూర్తి పర్యవేక్షణ లో చేపట్టారు. అనంతరం అథ్లెటిక్స్‌ సీనియర్‌ క్రీడాకారులు పి.తవిటయ్య, ఎం.కామయ్య, కె.గోపి అథ్లెటిక్స్‌ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా సత్కరించారు. పరుగు పందెం, జావిలింగ్‌ త్రో, జంపింగ్‌ తదితర విభా గాల్లో పోటీలు నిర్వహిం చారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు అక్టోబరులో కర్నూలులో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కె.రాజారావు, కె.హరిబాబు,, కె.మాధవరావు, టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

హోరాహోరీగా వాలీబాల్‌ పోటీ

జి.సిగడాం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రుల సందర్భంగా ఆదివారం మెట్టవలసలో ఉత్తరాంధ్ర స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలు పీఏసీఎస్‌ చైర్మన్‌ బెవర జగన్నాథరావు, మాజీ సర్పంచ్‌ కామోజలు సీతారాం, ఐటీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ అడ్వజర్‌ శాసపు కిరణ్‌కుమార్‌ పర్యవేక్షణలో చేపట్టారు. విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 23 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆదివారం వివిధ జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగాయి. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కామోజలు ఆరుద్ర, ఎంపీటీసీ సభ్యురాలు బెవర లక్ష్మి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు జగన్నాఽథరావు తదితరులు పాల్గొన్నారు. విజేతలకు సోమవారం బహు మతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Sep 20 , 2026 | 11:52 PM