Share News

శ్రీముఖలింగేశ్వరాలయంలో ఆకాశదీపం ప్రారంభం

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:13 AM

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరాలయ శిఖరంపై అర్చకులు బుధవారం ఆకాశ దీపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఒడిశా సంప్రదాయం ప్రకారం ఆశ్వయుజ మాసం పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు కార్తీకమాస పూజలు చేస్తారు.

    శ్రీముఖలింగేశ్వరాలయంలో    ఆకాశదీపం ప్రారంభం
ఆకాశదీపం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్న అర్చకులు

జలుమూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరాలయ శిఖరంపై అర్చకులు బుధవారం ఆకాశ దీపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఒడిశా సంప్రదాయం ప్రకారం ఆశ్వయుజ మాసం పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు కార్తీకమాస పూజలు చేస్తారు. ఈ సందర్భంగా శ్రీముఖలింగేశ్వరాలయ శిఖరంపై ఆకాశ దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి వరకు కొనసాగిస్తున్నట్లు అర్చకులు నారాయణమూర్తి తెలిపారు. నెల రోజులపాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, నిర్వహించి అనంతరం ఆకాశదీపం వెలిగించారు. ఈ కార్యక్రమంలో అర్చకుల సంఘ అధ్యక్షులు ఎస్‌.వి.చలం, అర్చకులు సింహాచలం, శ్రీకృష్ణ, శివ, అచ్యుత, అప్పారావు, దేవదాయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2026 | 12:13 AM