ఏడుపదుల వయసులో..
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:07 AM
డీఈవోగా, డిపెప్ (ప్రస్తుత సర్వశిక్షాభియాన్) ఏపీసీగా పనిచేసి పదవీ విరమణ చేసిన బలివాడ మల్లేశ్వరరావు ఎంఎల్‌ఐఎస్సీ సెమిస్టర్ పరీక్షలు రాశారు.
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): డీఈవోగా, డిపెప్ (ప్రస్తుత సర్వశిక్షాభియాన్) ఏపీసీగా పనిచేసి పదవీ విరమణ చేసిన బలివాడ మల్లేశ్వరరావు ఎంఎల్‌ఐఎస్సీ సెమిస్టర్ పరీక్షలు రాశారు. వమరవల్లి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేసిన ఈయన విద్యాశాఖలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించారు. సుమారు ఏడు పదుల వయసులో చదువుపై జిజ్ఞాసతో పరీక్షలు రాస్తుండడం నేటి యువతరానికి ఆదర్శం.. స్ఫూర్తిదాయకం.. ఇప్పటికే అనేక పోస్టు గ్రాడ్యు యేషన్ డిగ్రీలు పూర్తి చేసిన మల్లేశ్వరరావు మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఎంఎల్‌ఐఎస్సీ పరీక్ష రాసి చదువుపై ఆసక్తి చూపడం విశేషం.