Share News

రాజముద్రతో రైతులకు భరోసా

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:03 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వేలో జరిగిన తప్పులను సవరించడంతోపాటు పట్టాదారు పాస్‌ పుస్తకాలపై రాజముద్రను ముద్రించి రైతులకు భూములపై పూర్తిస్థాయిలో భరోసా కల్పించామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.

  రాజముద్రతో రైతులకు భరోసా
పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీచేస్తున్న ఎంజీఆర్‌:

ఎల్‌.ఎన్‌.పేట, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వేలో జరిగిన తప్పులను సవరించడంతోపాటు పట్టాదారు పాస్‌ పుస్తకాలపై రాజముద్రను ముద్రించి రైతులకు భూములపై పూర్తిస్థాయిలో భరోసా కల్పించామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శనివారం యంబరాం, బొడ్డవలసల్లో రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన గ్రామసభల్లో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు. కాగా యంబరాంలో నిర్వహించిన కోదండ రామాలయం ప్రతిష్ఠోత్సవంలో భాగంగా పూజ లు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి 50 వేల కమిటీ సభ్యులకు అందజేశారు.

ఫపాతపట్నం మార్చి 4(ఆంధ్రజ్యోతి): గ్రామీణాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్రఅని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నంలో 34 పంచాయతీల సర్పంచ్‌లకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. తొలుత క్యాంపు కార్యాలయంలో మండలపరిషత్‌ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు.

Updated Date - Apr 05 , 2026 | 12:03 AM