యువత భవితకు భరోసా: శంకర్
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:54 PM
నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేసి యువతకు భరోసా కల్పి స్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేసి యువతకు భరోసా కల్పి స్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఎర్రన్న విద్యా సంకల్పం కోచింగ్ సెంటర్, సెంట్రల్ లైబ్రరీ, ఆర్ట్స్ కాలేజీ బీసీ స్టడీ సర్కిల్, హారికా స్టడీ హాల్‌ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో ఈ శిక్షణ కార్యక్ర మాలు నిర్వ హిస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. గత వైసీపీ పాలనలో ఏపీపీఎస్‌సీ గ్రూప్-1 పరీక్షల్లో సుమారు రూ.150 కోట్లు అవినీతి జరిగిందని, ప్లంబర్లు, ఎలక్ర్టీషియ న్లతో జవాబు పత్రాలు దిద్దించి నిరుద్యోగుల జీవి తాల తో ఆడుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభు త్వం ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ద్వారద 16 వేల టీచర్ల పోస్టులను భర్తీ చేసిం దన్నారు. సుమారు 2,600 ఉద్యోగాలతో మంత్రి లోకేశ్ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారన్నారు. యువత ఈ శిక్షణలను వినియోగించుకుని ఉద్యోగాలు సాధిం చాలని కోరారు.
ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ దోహదం
శ్రీకాకుళం స్పోర్ట్స్, సెప్టెంబరు 30(ఆంధ్ర జ్యోతి): బాలికలు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ దోహదం చేస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం కరాటే శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఈవో ఎ.రవిబాబు, సమగ్ర శిక్షా ఏపీసీ వేణుగోపాలరావు, హెచ్‌ఎం పెంకి సుజాత, తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్య క్షుడు శ్రీను, బహుజన నేత కంఠ వేణు, ఎం. సుధీర్ వర్మ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.