జైలు ఖైదీల కుటుంబాలకు సాయం అందించాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:09 AM
జైలు ఖైదీల కుటుంబాలకు అవసరమయ్యే న్యా య సహాయం అందించేందుకు ప్యానల్ లాయ ర్లు, పారా లీగల్ వలంటీర్లు సిద్ధంగా ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరి బాబు కోరారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి
శ్రీకాకుళం లీగల్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): జైలు ఖైదీల కుటుంబాలకు అవసరమయ్యే న్యా య సహాయం అందించేందుకు ప్యానల్ లాయ ర్లు, పారా లీగల్ వలంటీర్లు సిద్ధంగా ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరి బాబు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక న్యాయసేవాసదన్‌లో ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహిం చారు. నల్సా ఈ రకమైన న్యాయసహాయం అం దించేందుకు స్పృహ అనే ఒక పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఖైదీలకు వారి కుటుంబాలకు మధ్య సమన్వయం సాధించ డంలో న్యాయసేవా కార్యకర్తల పాత్ర ప్రాముఖ్యాన్ని వివరించారు.
‘లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి’
సోంపేట, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ లోక్‌అదాలత్‌ను మే 9వ తేదీన నిర్వహిస్తున్నా మని, ఎక్కువ శాతం కేసులను రాజీ చేయించి విజయవంతం చేయాలని ఆరవ అదనపు జిల్లా న్యాయాధికారి, మండల న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు కోడూరు కిశోర్‌బాబు కోరారు. ఈ మేరకు సోమవారం కోర్టు ఆవరణలో సోంపేట బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పోలీసు అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క న్యాయ వాది వీలైనంత ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు కృషి చేయాలని అన్నారు. కక్షిదారులతో మాట్లాడి రాజీ చేయాలని పోలీసు, న్యాయవాదులకు సూ చించారు. సీనియర్ సివిల్ న్యాయాధికారులు జె.శ్రీనివాసరావు, కె.శ్రీనువాసరావు, బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు కేవీఆర్, ఏపీపీ డి.జగన్నా యకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.