అర్హతే ప్రాతిపదికగా సహాయం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:23 PM
అర్హతే ప్రాతిపదికగా సహాయం చేస్తున్నామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): అర్హతే ప్రాతిపదికగా సహాయం చేస్తున్నామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక కాంపు కార్యాలయంలో కొత్తూరు మండలంలోని బలదకు చెందిన బెహర శంకర రావు కుటుంబసభ్యులకు రూ.80,916 సీఎంఆర్‌ఎఫ్ చెక్కును గురువారం అందజేశారు. శంకరరావు మేడపై నుంచి జారిపడిపోడంతో రెండుకాళ్ల విరగడం వల్ల శస్త్రచికిత్సకు సీఎంఆర్‌ఎఫ్ కింద ఆర్థికసాయం చేశారు.