Share News

మద్యం మత్తులో వ్యాపారిపై దాడి

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:22 AM

నౌపడ మొయిన్‌ రోడ్డులో వ్యాపారి అందవరపు సంతోష్‌కుమార్‌పై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో శనివారం దాడికి పాల్పడ్డారు.

మద్యం మత్తులో వ్యాపారిపై దాడి

సంతబొమ్మాళి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): నౌపడ మొయిన్‌ రోడ్డులో వ్యాపారి అందవరపు సంతోష్‌కుమార్‌పై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో శనివారం దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఆ వ్యక్తి సెల్‌ రీచార్జి కోసం సంతోష్‌కుమార్‌ షాపుకు వచ్చాడు. మద్యం తాగి ఉండడంలో తర్వాత రీచార్జి చేస్తానని షాపు యాజమాని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తి బండ బూతులు తిడుతూ షాపులోకి వచ్చి సంతోష్‌కుమార్‌పై దాడి చేశాడు. దీంతో భయపడిన సంతోష్‌కుమార్‌ ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఆ వ్యక్తి నడిరోడ్డుపైకి వచ్చి పోలీసులను బండబూతులు తిట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి వివరణ కోరగా.. తాను బందోబస్తు కోసం ఇచ్ఛాపురం వచ్చానని చెప్పారు.

Updated Date - Jan 04 , 2026 | 12:22 AM