ఆదిత్యుని సేవలో అసోం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:44 PM
ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లి సూర్య నారాయణ స్వామిని అసోం రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కోట ఆదివారం దర్శించు కుని ప్రత్యేక పూజలు చేశారు.
అరసవల్లి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లి సూర్య నారాయణ స్వామిని అసోం రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కోట ఆదివారం దర్శించు కుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ సూపరింటెండెంట్ నాయు డు స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం అనివెట్టి మండపంలో వేదాశీర్వచనం చేశారు. స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని సూపరింటెండెంట్ అందజేశారు. కార్య క్రమంలో వేద పండితులు పార్థసారథి శర్మ, వికాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.