Share News

స్పృహ తప్పిన వృద్ధుడికి ఏఎస్‌ఐ సేవలు

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:59 PM

నగరంలోని సోమవారం ఎండ వేడిమికి తట్టుకోలేక స్పృహ త తప్పిపడిపోయిన వృద్ధుడికి అక్కడ విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ కమలాకర్‌ స్పందించి సేవలు చేసి ఆసుపత్రికి తరలించి మానవ త్వాన్ని చాటుకున్నారు.

స్పృహ తప్పిన వృద్ధుడికి ఏఎస్‌ఐ సేవలు
స్పృహ తప్పిన వృద్ధుడికి సేవ చేస్తున్న ఏఎస్‌ఐ

శ్రీకాకుళం క్రైం, సెప్టెం బరు 7 (ఆంధ్రజ్యోతి): నగరంలోని సోమవారం ఎండ వేడిమికి తట్టుకోలేక స్పృహ త తప్పిపడిపోయిన వృద్ధుడికి అక్కడ విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ కమలాకర్‌ స్పందించి సేవలు చేసి ఆసుపత్రికి తరలించి మానవ త్వాన్ని చాటుకున్నారు. అరసవల్లి జంక్షన్‌ వద్ద ఓ వృదుడు ఎండ వేడికి తట్టుకో లేక ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. అయితే అక్కడే ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ కమలాకర్‌ వెంటనే స్పందించి వృద్ధుడిని ఎత్తుకొని పక్కకు పెట్టి 108 వాహనంలో శీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్సఅందించే ఏర్పాట్లు చేశారు. దీంతో స్థానికంగా ఉన్నవారు ఏఎస్‌ఐని అభినందించారు.

Updated Date - Sep 07 , 2026 | 11:59 PM