భరతమాత స్వేచ్ఛ కోసం పోరాడిన అష్ఫాకుల్లాఖాన్’
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:44 PM
భారతమాత స్వేచ్ఛ కోసం, హిందూ- ముస్లిం ఐక్యతకు పోరా డి చరిత్రలో నిలిచిన మహనీయుడు అష్ఫా కుల్లాఖాన్ అని వక్తలు డాక్టర్ అదీబ్ హసన్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి అన్నారు.
పాత శ్రీకాకుళం అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): భారతమాత స్వేచ్ఛ కోసం, హిందూ- ముస్లిం ఐక్యతకు పోరా డి చరిత్రలో నిలిచిన మహనీయుడు అష్ఫా కుల్లాఖాన్ అని వక్తలు డాక్టర్ అదీబ్ హసన్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి 27 ఏళ్ల వయసులోనే ఉరికంబం ఎక్కిన స్వాతంత్య్ర సమరయోధుడు అష్ఫా కుల్లాఖాన్ 126వ జయంతిని శాంతినగర్ కాలనీలోని స్వాతంత్య్ర సమరయోధుల స్మృతి వనంలో గురువారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. బ్రిటీష్ వారిని ఈ దేశం నుంచి తరిమూందుకు హిందూ మిత్రుడు రాంప్రసాద్ భిస్మిల్లా తో కలిసి చేసిన పోరాటం ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో విగ్రహ దాత మహమ్మద్ షాన్‌వాజ్, ముజీబ్ కుటుంబ సభ్యులు, విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగం మధు సూదనరావు, గాంధీ మందిరం ప్రతినిధులు బరాటం లక్ష్మణరావు, జామి భీమశంకర్, మహ మ్మద్ ఆరిఫ్, మహిబుల్లా ఖాన్, శంకరరావు, ఎంవీఎస్‌ఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.