Share News

కళాకారులను ఆదరించాలి

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:23 PM

కళాకారులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని పద్మశ్రీ యడ్ల గోపాలం, నంది అవార్డు గ్రహీత వంకాయల మారు తీ ప్రసాద్‌, కలియుగ అర్జున బిరుదాంకితుడు కురిటి సత్యంనాయుడు అన్నారు.

కళాకారులను ఆదరించాలి
కళాకారుడిని సత్కరిస్తున్న నిర్వాహకులు

రణస్థలం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): కళాకారులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని పద్మశ్రీ యడ్ల గోపాలం, నంది అవార్డు గ్రహీత వంకాయల మారు తీ ప్రసాద్‌, కలియుగ అర్జున బిరుదాంకితుడు కురిటి సత్యంనాయుడు అన్నారు. మణికంఠ నాటక అకాడమి-కళాపరిషత్‌ పౌరాణిక నాటక ఏకపాత్రా భినయం పోటీలు కోష్ట గ్రామంలో గురువారం అర్థరాత్రి వరకు నిర్వహించారు. ఈ పోటీలలో 33 మంది కళాకారులు పాల్గొన్నారు. హరిశ్చంద్ర పాత్రధారి వండాన మహేష్‌ ప్రథమ, ఉత్తరావల్లి రాములు నాయుడు ద్వితీయ, కె.భాస్కరరావు తృతీయ బహుమతులు సాధించారు. విజేతలకు బహుమతులను అందించారు.

Updated Date - Jan 02 , 2026 | 11:23 PM