వాహనంపై వచ్చి.. ఆభరణాలు దోచుకెళ్లి
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:57 PM
అనంత గిరి పంచాయతీకి చెందిన బందాపు పాపమ్మ మెడలో ఉన్న బంగారు ఆభర ణాలను ఇద్దరు యువకులు బైక్పై వచ్చి లాక్కెళ్లిన సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
వజ్రపుకొత్తూరు మండలంలో కలకలం
వజ్రపుకొత్తూరు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): అనంత గిరి పంచాయతీకి చెందిన బందాపు పాపమ్మ మెడలో ఉన్న బంగారు ఆభర ణాలను ఇద్దరు యువకులు బైక్పై వచ్చి లాక్కెళ్లిన సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి బాధితురాలు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం పాపమ్మ తన బంధువులను వెంకటాపురం బంస్టాండ్ వద్ద దిగబెట్టి తిరిగి... పక్కనే ఉన్న అనంతగిరి గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో అక్కడి శివాలయం వద్ద తెలిసిన వారితో మాట్లాడుతుండగా హెల్మెట్ దరించిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి పాపమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారం గొలుసు, పుస్తెలు, శతమానం, తెంపుకొని బెండిగేటు వైపు వెళ్లిపోయారు. పాపమ్మ కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు సంఘటన స్థలానికి చేరుకునే సరికి నిందితులు పరారయ్యారు. ఈ సంఘటనపై అందిన ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు ఎస్ఐ నిహార్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. సీసీ పుటేజీల ఆధారంగా ఇద్దరు అనుమానిత యువకులును గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని ఎస్ఐ నిహార్ తెలిపారు.