Share News

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:31 PM

రథసప్తమి వేడుకల సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడి ్డ అధికారులను ఆదేశించారు. గురువారం వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
అధికారులకు సూచనలు చేస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రథసప్తమి వేడుకల సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడి ్డ అధికారులను ఆదేశించారు. గురువారం వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, వాహ నాల మళ్లింపు ఏర్పాట్లను పరిశీలించారు. రద్దీ నియంత్రణకు పక డ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. ఆలయ పరిసరాల్లో ప్రసాదాల విక్రయాల కోసం ఏర్పాటు చేయనున్న కౌంటర్లు, భక్తులు పాదరక్షలు భద్రపరిచే స్థలాలు, క్యూలైన్ల నిర్వహణ, ఇతర సౌక ర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అత్యవసర సేవల వాహ నాలకు ప్రత్యేక మార్గాలు కేటాయించాలని, సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్‌ నిఘా ద్వారా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, ఎంహెచ్‌వో సుధీర్‌కుమార్‌, ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, సీఐలు పైడపునాయకుడు, ఈశ్వరరావు, రామారావు, చంద్రమౌళి, తదిరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 11:31 PM