కేంద్ర బృందం పర్యటనకు ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:15 AM
జాతీయ స్థాయిలో బాలల స్నేహపూర్వక గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన బోరవానిపేట గ్రామాన్ని ఈ నెల 12న కేంద్ర బృందం పరిశీలించనున్న నేపథ్యంలో బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సందర్శించారు.
పరిశీలించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
గార, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో బాలల స్నేహపూర్వక గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన బోరవానిపేట గ్రామాన్ని ఈ నెల 12న కేంద్ర బృందం పరిశీలించనున్న నేపథ్యంలో బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ మండల పరిషత్ ప్రాథమి కోన్నత పాఠశాల ప్రాంగణంలో వివిధ శాఖలు ఏర్పాటు చేస్తున్న స్టాల్స్‌ను ఇతర ఏర్పాట్లపై ఆరా తీశారు. బాలల హక్కుల పరిరక్షణ, సంపూర్ణ విద్య, ఆరోగ్య సంరక్ష ణ, పోషకాహార భద్రత, బాల్య వివాహాలు, బాల కార్మిక నిర్మూలన వంటి అంశాల్లో సాధించిన ప్రగతిని కేంద్ర బృందం పరిశీలిస్తుందని అందుకు సంబంధించిన రికార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లును పరిశీలించారు. కార్య క్రమంలో జడ్పీ సీఈవో ఆర్.వెంకటరామన్, డీపీఆర్వో స్వరూపారాణి, డిప్యూటీ సీఈవో కె.సౌమ్య, డీపీవో ఆర్.గోపిబాల, తహసీల్దార్ చక్రవర్తి, ఎంపీడీవో ఎస్.శ్రీనివాసులు, మండల ప్రత్యేకాధికారి పీఎస్‌జీ బాలకృష్ణ, డిప్యూటీ ఎంపీడీవో ఎ.రమేష్ తదితరులు ఉన్నారు.