పకడ్బందీగా రథసప్తమి వేడుకల ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:03 AM
రథ సప్తమి వేడుకల కోసం నగరంలో జరుగుతున్న ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్క ర్ అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రథ సప్తమి వేడుకల కోసం నగరంలో జరుగుతున్న ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్క ర్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి కోడిరామ్మూర్తి స్టేడియం, ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. కేఆర్ స్టేడియంలో నిర్వ హించే సాంస్కృతిక కార్యక్రమాలకు వేల సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉందని, గ్యాలరీలు, సిట్టింగ్ ఏర్పాట్లు పటిష్టంగా ఉండా లన్నారు. చిన్నారుల కోసం స్టేడియంలో కిడ్స్ ఆటస్థలం, అమ్యూజ్‌మెంట్ పార్కులను పరిశీలించారు. కార్యక్రమా ల వద్ద ఎక్కడా తోపులాటలు జరుగకుండా చూడాలని ఆదేశించారు. డ్వాక్రా బజార్, ఫుడ్ ఫెస్టివల్ స్టాళ్లను పరి శీలించి పలు సూచనలు చేశారు. సందర్శకు లకు ఎటు వంటి ఇబ్బంది కలుగకుండా విశాలమైన దారులు ఉండే లా చూడాలన్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ‘హాట్ ఎయిర్ బెలూన్’ పాయింట్ వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జేసీ మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమ న్వయంతో పనిచేయాలన్నారు. పారిశుధ్యం, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు.
ఆద్యంతం అలరించిన ‘భక్తప్రహ్లాద’ నాటకం
అరసవల్లి/లీగల్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రథ సప్తమి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని అంబేద్కర్ ఆడిటోరియంలో సోమ వారం సాయంత్రం సురభి కళాకారులచే ‘భక్తప్రహ్లాద’ నాటకం ఆద్యంతం అలరించింది. వివిధ సన్నివేశాల్లో కళాకారులు నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఆహూతుల ప్రశంసలు అందుకున్నారు. అద్భుతమైన సెట్టింగులతో, సినీ హంగులతో, మాయాజాలంతో చేపట్టిన నాటకం ప్రదర్శన చివరి వరకు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సురభి (శ్రీ వినాయక నాట్యమండలి) కళా కారులు పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయి ప్రదర్శించిన తీరు అలరించింది. హిరణ్యకశిపుడి గంభీరమైన నటన, ప్రహ్లాదుడి భక్తి తత్పరత, క్లైమాక్స్‌లో నరసింహస్వామి ఆవిర్భావ ఘట్టం ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేశా యి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆర్.వేణుగోపాలరావు దర్శకత్వం వహించారు. మంగళ వారం ఇదే వేదికలో ‘భూకైలాస్’ నాటకం ప్రదర్శించ నున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పలు వురు కళాకారులు, పట్టణ వాసులు పాల్గొన్నారు.