Share News

నీట్‌ పీజీకి ఏర్పాట్లు

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:52 PM

నరసన్నపేట కోర్‌ టెక్నాలజీ కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న నీట్‌ పీజీ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

   నీట్‌ పీజీకి ఏర్పాట్లు
కోర్‌ టెక్నాలజీ కేంద్రంలో పరిశీలిస్తున్న ఆర్డీవో సాయిప్రత్యూష

నరసన్నపేట, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట కోర్‌ టెక్నాలజీ కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న నీట్‌ పీజీ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కోర్‌ టెక్నాలజీ కేంద్రాన్ని శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష శుక్రవారం పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, జనరేటర్‌ సౌకర్యంతోపాటు పరీక్ష కేంద్రంలో వెలుతురు, గాలి వంటి సదుపాయంపై అడిగి తెలుసుకొన్నారు. పరీక్షల నిర్వహణపై రెవెన్యూ, పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. పరీక్ష కేంద్రం పరిధిలో ఎటువంటి ఇంటర్నెట్‌, జిరాక్స్‌ కేంద్రాలు తెరవకుండా పోలీసులు పర్యవేక్షించాలని కోరారు. వైద్యఆరోగ్యసిబ్బంది తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో సూచించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సులువుగా వచ్చే విధంగా పలు కూడళ్లు వద్ద సమాచార బ్యానర్లు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆర్‌.సత్యనారాయణ, ఎస్‌ఐ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2026 | 11:52 PM