Share News

ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:38 AM

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరగనున్న పోలింగ్‌కు టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల పరిధి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని టెక్కలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం టెక్కలి సబ్‌కలెక్టర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రెండు నియోజకవర్గాల పరిధిలో 568 పోలింగ్‌స్టేషన్లకు సీసీ టీవీలు, వెబ్‌కాస్ట్‌, వీడియోగ్రాఫర్ల సమక్షంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు
పాతపట్నం: పోస్టల్‌ బ్యాలెట్ల వినియోగాన్ని పరిశీలిస్తున్న ఆర్వో విజయలక్ష్మి

టెక్కలి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరగనున్న పోలింగ్‌కు టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల పరిధి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని టెక్కలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం టెక్కలి సబ్‌కలెక్టర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రెండు నియోజకవర్గాల పరిధిలో 568 పోలింగ్‌స్టేషన్లకు సీసీ టీవీలు, వెబ్‌కాస్ట్‌, వీడియోగ్రాఫర్ల సమక్షంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి టెక్కలి మండలంలో అక్కవరం, పాత నౌపడా, తలగాం, నర్శింగపల్లి, రావివలస పోలింగ్‌స్టేషన్లు, కోటబొమ్మాళి పరిధిలో సరియా బొడ్డపాడు, హరిశ్చంద్రాపురం, నిమ్మాడ, శ్రీజగ న్నాథపురం, కొల్లిపాడు పోలింగ్‌స్టేషన్లు, నందిగాం మండలంలో దిమ్మిడిజోల, దీనబంధుపురం, కొత్తగ్రహారం, కవిటిఅగ్రహారం, హరిదాసుపురం, కణితివూరు, శివరాంపురం, పీవీపురం, నౌగాం పో లింగ్‌స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్‌ స్టేష న్లగా గుర్తించామని చెప్పారు. నందిగాం మండలంలోని కాపుతెంబూరు, నరేంద్రపురం, అన్నాపురం అతిసమస్యాత్మక గ్రామాలుగా గుర్తించామని తెలిపారు. టెక్కలి, పాతపట్నంల్లో ఒక మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సంతబొమ్మాళి మండలంలోని మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన ఓటర్లు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఉండడంతో వీరికి ప్రత్యేక బస్సుల ద్వారా మూలపేట పోలింగ్‌ కేంద్రానికి ఓటింగ్‌కు తరలించనున్నామని చెప్పారు. టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల్లో 86 రూట్లు, 23జోన్లు ఏర్పాటుచేశామని తెలిపారు. టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి బుధవారం సామగ్రి అందజే స్తామని, పాతపట్నానికి సంబంధించి ఏఎంసీ కేంద్రం వద్ద, మిగిలినవన్నీ ఆయా మండల ప రిషత్‌ కార్యాలయాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తామని చెప్పారు. రెండు నియోజకవర్గాల పరిధి 780మంది సిబ్బందిని ఈ ఎన్నికలకు వినియోగించనున్నామని తెలిపారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులు కె.కొత్తూరు దరి ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల స్ట్రాంగ్‌రూంకు తెప్పించి ఆయా రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్‌రూంకు తాళం వేయనున్నట్లు చెప్పారు.

ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

ఫ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విజయలక్ష్మి

పాతపట్నం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణలో అప్ర మత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి. విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం పాతపట్నంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

ఫనరసన్నపేట, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో జడ్పీటీసీ, ఎంపీటీసీల కౌంటింగ్‌లో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి సెట్‌శ్రీ సీఈవో విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్వో అనురాధ, ఏఆర్వోలు సత్యనారాయణ, పాల్గొన్నారు.

ఫహిరమండలం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తీసుకుం టామని కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాల లోపలికి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడం నిషేధమని తెలిపారు.

ఫనందిగాం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. గురువారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి నందిగాం ఉన్నత పాఠశాల కేంద్రంగా బుధవారం సామగ్రిని పంపిణీ చేయనున్నారు.

ఫజలుమూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగు కేంద్రాలకు సామగ్రి 10 కౌంటర్లు ద్వారా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో బి.చిన్నమ్మడు తెలిపారు.

ఫఎల్‌.ఎన్‌.పేట, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఎన్నికలకోడ్‌ అమలులో ఉండడంతో వాహనాలను ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం నడపాలని గణాంకాల విభాగం అధికారి(తహసీల్దార్‌) జె. ఈశ్వరమ్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అలికాం-బత్తిలి ప్రధానరోడ్డుపై వాహనాలను తనిఖీచేశారు.

Updated Date - Nov 04 , 2026 | 12:38 AM