Share News

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

ABN , Publish Date - May 11 , 2026 | 12:18 AM

Helipad site inspection ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 16న నరసన్నపేట పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

సీఎం పర్యటనకు ఏర్పాట్లు
తామరాపల్లి వద్ద హెలీప్యాడ్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

హెలీప్యాడ్‌ స్థల పరిశీలన

నరసన్నపేట, మే 10(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 16న నరసన్నపేట పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం జమ్ము, తామరాపల్లి వద్ద ప్రతిపాదిత స్థలాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పరిశీలించారు. హెలీప్యాడ్‌ స్థల అనుకూలతలపై అధికారులతో చర్చించారు. హెలీప్యాడ్‌ స్థల విస్తీర్ణం మ్యాప్‌ ద్వారా నిశితంగా పరిశీలించారు. వాహనాల పార్కింగ్‌, వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గం తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. హెలీప్యాడ్‌ స్థల మైదానాన్ని త్వరితగతిన సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో వేణుగోపాలరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ తిరుపతిరావు, తహసీల్దార్‌ సత్యనారాయణ, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు గణేష్‌, రంజిత్‌ పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 12:18 AM