గుండెపోటుతో ఆర్మీ మేజర్ మృతి
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:12 AM
కామేశ్వరిపేట గ్రామానికి చెందిన పతివాడ భూషణరావు (46) శనివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు.
జమ్మూకశ్మీర్‌లో ఘటన.. కామేశ్వరిపేటలో విషాదఛాయలు
నరసన్నపేట, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కామేశ్వరిపేట గ్రామానికి చెందిన పతివాడ భూషణరావు (46) శనివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. జమ్ముకశ్మీర్ లే సెక్టార్ పరిఽధిలో ఆర్మీమేజర్‌గా విధులు నిర్వహిస్తున్న భూషణరావు శనివారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురైయ్యారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో గుండెపోటుకు గురై మృతిచెందినట్టు సమాచారం వచ్చినట్టు బంధువులు తెలిపారు. 25 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న భూషణరావు అంచెలంచెలుగా ఎదిగారు. కాగా భూషణరావుకి తల్లిదండ్రులు అప్పన్న, రాధా, భార్య సుజాత, పిల్లలు హిమబిందు, శశి ఉన్నారు. సోమవారం భూషణరావు మృతదేహం స్వగ్రామానికి తీసుకురానున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.