Share News

ప్రభుత్వ లాంఛనాలతో ఆర్మీ జవాన్‌ అంత్యక్రియలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:30 AM

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ జవాన్‌ బడ్డి బాలకృష్ణ (27) అలియాస్‌ బాలరాజు అంత్యక్రి యలు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం జరిగా యి.

ప్రభుత్వ లాంఛనాలతో ఆర్మీ జవాన్‌ అంత్యక్రియలు
బాలకృష్ణ భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న ఆర్మీ జవాన్లు

కంచిలి/ఇచ్ఛాపురం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ జవాన్‌ బడ్డి బాలకృష్ణ (27) అలియాస్‌ బాలరాజు అంత్యక్రి యలు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం జరిగా యి. బాలకృష్ణది కం చిలి మండలం భొగాబెణి పంచాయతీ బొనొమాళి గ్రామం. శనివారం సాయంత్రం ఇచ్ఛాపురం మండలం కె.శాసనాం వద్ద ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో బాలకృష్ణ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఇచ్ఛాపురం సీహెచ్‌సీ లో ఎస్‌ఐ జనార్దనరావు దగ్గరుండి శవ పంచనా మా జరిపించారు. అనంతరం మృతదేహాన్ని ఆర్మీ వాహనంలో బొనొమాళికి ఊరేగింపుగా తీసుకెళ్లా రు. ఒడిశా గోపాల్‌పూర్‌ బెటాలియన్‌కు చెందిన ఆర్మీ జవాన్లు హాజరై అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మూడు రౌండ్‌లు చొప్పున గాల్లోకి కాల్పులు జరిపి సైనిక వందనం సమర్పించారు. మృతుడి భార్య శృతికి జాతీయ పతాకాన్ని అందించి గౌరవ వందనం సమర్పించారు. మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ప్రతినిధి పైల మన్మథరావు, జనసేన నాయకులు డొక్కరి ఈశ్వరరావు, గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు.

Updated Date - Mar 09 , 2026 | 12:31 AM