Share News

విరిగిపడిన చెట్టుకొమ్మ.. ఆర్మీ జవాన్‌ మృతి

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:16 AM

చెట్టుకొమ్మ విరిగి పడడంతో జిల్లాకు చెందిన ఓ ఆర్మీ జవాన్‌ గురువారం మృతి చెందాడు.

విరిగిపడిన చెట్టుకొమ్మ.. ఆర్మీ జవాన్‌ మృతి
సూర్యనారాయణ (ఫైల్‌)

  • జమ్మూకశ్మీర్‌లో ఘటన

  • ఒప్పంగిలో విషాదం

శ్రీకాకుళం రూరల్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): చెట్టుకొమ్మ విరిగి పడడంతో జిల్లాకు చెందిన ఓ ఆర్మీ జవాన్‌ గురువారం మృతి చెందాడు. ఆర్మీ అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు వచ్చిన సమాచారంతో వారు తెలిపిన వివరాల మేరకు.. ఒప్పంగి గ్రామానికి చెందిన శిమ్మ సూర్యనారాయణ(44) ఆర్మీలో సుమా రు 20 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నాయక్‌ సుబేదార్‌గా విధు లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం జమ్మూకశ్మీర్‌లో సంభవించిన తుఫాన్‌ ప్రభావంతో ఓ చెట్టు కొమ్మ విరిగి అతడిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని అక్కడే ఉన్న ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సూర్యనారాయణకు భార్య శ్రీలత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సూర్యనారాయణ పార్థివదేహం శనివారం స్వగ్రామానికి తీసుకురానున్నారు. అధికార లాంఛనాలతో ఆర్మీ జవాన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సూర్యనరాయణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Apr 18 , 2026 | 12:16 AM