డీఎస్సీపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:45 PM
రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు యువత జీవితాల తో గొడ్డలి పార్టీ నాయకుడు జగన్‌రెడ్డి చెలగాట మాడుతున్నారని, దమ్ముంటే డీఎస్సీపై అసెంబ్లీలో చర్చ కు రావాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
వైసీపీవి దొంగ దీక్షలు
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు యువత జీవితాల తో గొడ్డలి పార్టీ నాయకుడు జగన్‌రెడ్డి చెలగాట మాడుతున్నారని, దమ్ముంటే డీఎస్సీపై అసెంబ్లీలో చర్చ కు రావాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సోమవారం మునిసిపల్ కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2024 ఎన్ని కలలో ప్రజలు ఛీకొట్టినా ఆ పార్టీ నేతల తీరుమారలే దన్నారు. ఒక అబద్దాన్ని నిజం చేసేందుకు జగన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కనీస ప్రతిపక్ష హోదా లేని వైసీపీ నాయకులు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పాటుపడుతున్న విద్యాశాఖామంత్రి నారా లోకేశ్‌ను రాజీనామా చూయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో వైసీపీ సైకోలు, గంజాయి ముఠా లు విధ్వంస కర ఘటనలతో పరామర్శలు, బలప్రదర్శనలు, దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఈనెల 17 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మెగా డీఎస్సీపై వైసీపీ కి చెందిన 11 మంది ఎమ్మెల్యే లు హాజ రైతే తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మి నేని సుజాత, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యా సాగర్, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ టి.చంద్రశేఖర్, నాయకులు ముర ళీధర్‌యాదవ్, రమణమూర్తి, రవీంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.
45 మందికి పింఛన్ల పంపిణీ
నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 45 మంది లబ్ధిదారులకు మంజూరైన వితంతు, దీర్ఘకా లిక రోగులకు పింఛన్లను సోమవారం మునిసిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, నియోజకవర్గ తెలుగు యువత నాయ కుడు తాడేల రాజారావు, కణితి విజయలక్ష్మి, కమిషనర్ టి.రవి పాల్గొన్నారు.
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
బూర్జ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేశారు. అనంతరం వావాం గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్య క్రమం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీవో తిరు పతిరావు తదితరులు పాల్గొన్నారు.