అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:28 AM
Roadworks have begun సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న గొడ్డలిపార్టీ నాయకులు.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. సోమవారం సరుబుజ్జిలి జంక్షన్‌లో రూ.13.40 కోట్ల ఉపాధిహామీ నిధులతో రహదారి పనులను పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
వైసీపీ నేతలకు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సవాల్
గత ప్రభుత్వ పాలన అవినీతిమయం: ఎమ్మెల్యే రవికుమార్
సరుబుజ్జిలి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న గొడ్డలిపార్టీ నాయకులు.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. సోమవారం సరుబుజ్జిలి జంక్షన్‌లో రూ.13.40 కోట్ల ఉపాధిహామీ నిధులతో రహదారి పనులను పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి పాలన సాగుతోంది. దీనిపై వైసీపీ నాయకులు చర్చకు వస్తే మేము సిద్ధంగా ఉన్నామ’ని తెలిపారు. కూన రవికుమార్ మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధి పనులను విస్మరించారు. కూటమి పాలనలో రహదారులను సుందరంగా నిర్మించాం. తాగునీటి సమస్యలను పరిష్కరిస్తున్నాం. అర్హులందరికీ పింఛన్లు అందజేస్తున్నామ’ని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌సీ పి.సత్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత, రాష్ట్ర డైరెక్టర్లు ఆనెపు రామకృష్ణ, తమ్మినేని చం ద్రశేఖర్, టీడీపీ నాయకులు నూకరాజు, సనపల ఢిల్లేశ్వరరావు, కిల్లి సిద్ధార్థ, అంబల్ల రాంబాబు పాల్గొన్నారు.