పశువైద్యుల నియామకం తక్షణం చేపట్టాలి
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:48 PM
ఎనిమిదేళ్లుగా డీఎస్సీ ద్వారా పశు వైద్యుల నియామకాలు చేపట్ట లేదని, తక్షణం తగు చర్యలు తీసుకుని ఆదు కోవాలని నిరుద్యోగ పశువైద్యుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.పిసిని రమేష్ డిమాండ్ చేశారు.
నిరుద్యోగ పశువైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్
అరసవల్లి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్లుగా డీఎస్సీ ద్వారా పశు వైద్యుల నియామకాలు చేపట్ట లేదని, తక్షణం తగు చర్యలు తీసుకుని ఆదు కోవాలని నిరుద్యోగ పశువైద్యుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.పిసిని రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమ వారం జడ్పీ కార్యాలయం ఎదుట వెటర్నరీ అసో సియేషన్ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 400 మంది సీనియర్ పశు వైద్యులు ఉద్యోగ విరమణ చేసినా ఆ ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదని విమర్శించారు. ప్రతీ 5వేల లైవ్‌స్టాక్ యూనిట్లకు ఒక వెటర్నరీ వైద్యుడు ఉండాలని, జిల్లాలో 6.2 లక్షల ఎల్‌యూలు ఉన్నాయని, అయితే వైద్యులు మాత్రం కేవలం 42 మాత్రమే ఉన్నారన్నారు. పశు వైద్యులున్నా కొందరు అధికారులు పారా స్టాఫ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల జిల్లాలోని వెటర్నరీ యువత తీవ్రం గా నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 10వ తరగతి చదివిన వారిని దొంగ సర్టిఫికెట్లతో ఏహెచ్‌ఏలుగా నియమించిందని ఆరోపించారు. పశుసంవర్థక శాఖ మంత్రిగా పని చేసిన సీదిరి అప్పలరాజు పశు వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని బహిరంగ హామీ ఇచ్చి, దీక్షను విరమింప జేశారని, ఆ హామీ నీటిమూట అయ్యిందన్నారు.