ఆర్టీసీలో డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:00 AM
శ్రీకాకుళం ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్ష ణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రజా రవా ణాధికారి (డీపీటీవో) సీహెచ్ అప్పలనారాయణ అన్నారు.
ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ
అరసవల్లి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్ష ణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రజా రవా ణాధికారి (డీపీటీవో) సీహెచ్ అప్పలనారాయణ అన్నారు. ఈ మేరకు 27వ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్నవారికి శుక్రవారం తన కార్యాలయంలో ధ్రువపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 28వ బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసక్తి ఉన్న వారికి ఒక ఏడాది అనుభవం, లైట్ వెహికల్ లైసెన్సు కలిగి, 21 సంవత్సరాలు నిండిన అభ్య ర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 30 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, రుసుం తదితర వివరాలకు 93908 86033 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమం లో 1, 2వ డిపో మేనేజర్లు అమరసింహుడు, శర్మ, పీఆర్వో ఏఎన్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.