ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:53 PM
ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) పరిధిలోని వైద్య కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇన్స్యూర్డ్ పర్సన్స్(ఐపీ) పిల్లల కోటా కింద ఎంబీ బీఎస్, బీడీఎస్, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వాని స్తున్నట్లు జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ కె.అజయ్ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు.
కార్మికశాఖ ఉప కమిషనర్ అజయ్ కార్తికేయ
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) పరిధిలోని వైద్య కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇన్స్యూర్డ్ పర్సన్స్(ఐపీ) పిల్లల కోటా కింద ఎంబీ బీఎస్, బీడీఎస్, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వాని స్తున్నట్లు జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ కె.అజయ్ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. నీట్-2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోటాకు అర్హులని, దేశంలోని 20 ఏఎస్‌ఐసీ వైద్య కళాశాలల్లో ఏపీ పిల్లల కోసం 695 ఎంబీబీఎస్, 28 బీడీఎస్, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన వారు ‘వార్డ్ ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్ కోసం ఈఎస్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అలాగే సర్టిఫికెట్ పొందినవారు, తదుపరి కౌన్సెలింగ్ కోసం ఎంసీసీ వెబ్‌సైట్ లో సంప్రదించాలన్నారు. ఈఎస్‌ఐసీ సభ్యత్వం కలిగిన కార్మికుల పిల్లలు మాత్రమే ప్రవేశలకు అర్హులని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.