Share News

‘నిధి ఆప్‌కే నికాత్‌, సువిధ’ పథకం వర్తింపు

ABN , Publish Date - May 28 , 2026 | 12:34 AM

నగరంలోని ఓషియానిక్‌ శాండ్‌ కంపెనీలో బుధవారం ఈఎస్‌ ఐసీ, ఏపీఎఫ్‌వో అధి కారులు సంయుక్తం గా ‘నిధి ఆప్‌కే నికాత్‌, సువిధ సమాగమం’ కార్యక్రమం నిర్వహిం చారు.

‘నిధి ఆప్‌కే నికాత్‌, సువిధ’ పథకం వర్తింపు
మృతుడి కుటుంబ సభ్యులకు పథకం ధ్రువీకరణ పత్రం అందిస్తున్న అధికారులు

మృతుడి కుటుంబానికి బెనిఫిట్‌ అందజేత

అరసవల్లి, మే 27(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఓషియానిక్‌ శాండ్‌ కంపెనీలో బుధవారం ఈఎస్‌ ఐసీ, ఏపీఎఫ్‌వో అధి కారులు సంయుక్తం గా ‘నిధి ఆప్‌కే నికాత్‌, సువిధ సమాగమం’ కార్యక్రమం నిర్వహిం చారు. కంపెనీలో పనిచేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 10న ఎం.సంతోష్‌కుమార్‌ మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులకు బుధవారం ఈఎస్‌ఐసీ డిఫెం డెంట్‌ బెనిఫిట్‌ను అందజేశారు. సంఘటన జరిగిన కేవలం నెల రోజు ల్లోనే కుటుంబానికి నెలవారీ పింఛను విడుదల చేసేందుకు గాను కేసును వేగవంతం చేయడం ద్వారా కుటుంబానికి తక్షణ ఉపశమనం కల్పించినట్లు ఈఎస్‌ఐసీ బ్రాంచ్‌ మేనేజర్‌ ప్రజ్ఞ, ఏఈపీఎఫ్‌వో అధికారి కృష్ణారావు తెలిపారు.

Updated Date - May 28 , 2026 | 12:34 AM