హత్యాయత్నం కేసులో అప్పన్నకు రిమాండ్
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:05 AM
హత్యాయత్నం కేసులో కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు చెందిన కింజరాపు అప్పన్నను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపారు.
సంతబొమ్మాళి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): హత్యాయత్నం కేసులో కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు చెందిన కింజరాపు అప్పన్నను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపారు. శుక్రవారం ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. అప్పన్న తమ్ముడితో మండలంలోని చెట్లతాండ్ర గ్రామానికి చెందిన చెక్క రామా రావు తమ్ముడి మనుమరాలు లహరితో కొన్నాళ కిందట వివాహం జరిగింది. అనంతరం వారి మధ్య విభేదాలు రావడంతో అప్పన్న కుటుంబ సభ్యులపై గతే డాది జూన్‌లో శ్రీకాకుళంలోని మహిళ పోలీసు స్టేషన్‌లో లహరి ఫిర్యాదు చేయ డంతో కేసు నమోదైంది. ఇందులో భాగంగా గత నెల 31న ఇరువర్గాల మధ్య రాజీ ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో అప్పన్న మరణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్టు బాధితుడు చెక్క రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పన్నపై కేసు నమోదైంది. దీంతో అప్పన్నను అరెస్టు చేసి గురువారం కోటబొమ్మాళి కోర్టులో హాజరుపరచగా.. న్యాయాధికారి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో అప్పన్నను నరసన్నపేట సబ్‌జైలుకు తరలించారు.