Share News

అప్పయ్యదొరది సుస్థిర స్థానం:ఎమ్మెల్యే

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:57 PM

జిల్లా కీర్తిని ఢిల్లీ వరకూ చాటిచెప్పిన గొప్ప వ్యక్తి హనుమంతు అప్పయ్యదొర అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు. ఆయన 91వ జయంతి సందర్భంగా స్థానిక కేటీరోడ్డులోని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

 అప్పయ్యదొరది సుస్థిర స్థానం:ఎమ్మెల్యే
అప్పయ్యదొర విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శిరీష :

పలాస, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా కీర్తిని ఢిల్లీ వరకూ చాటిచెప్పిన గొప్ప వ్యక్తి హనుమంతు అప్పయ్యదొర అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు. ఆయన 91వ జయంతి సందర్భంగా స్థానిక కేటీరోడ్డులోని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అప్పయ్యదొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో అప్పయ్యదొర చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, గాలి కృష్ణారావు, లొడగల కామేశ్వరరావుయాదవ్‌, సప్ప నవీన్‌, అంబటి కృష్ణమూర్తి, గురిటి సూర్యనారాయణ పాల్గొన్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు.... అప్పయ్యదొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరి బాబు, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్‌, హనుమంతు రామ్మోహన్‌ దొర నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

నందిగాంలో..

నందిగాం, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం పార్లమెంట్‌ మాజీ సభ్యులు, టెక్కలి మాజీ ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర జయంతి సందర్భంగా ఆదివారం ఆయనకు ఘనంగా నివాళుల ర్పించారు. మండల పరిషత్‌ కార్యాల యంలో గల అప్పయ్యదొర విగ్రహానికి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేడాడ తిలక్‌, ఎంపీపీ ఎన్‌.శ్రీరామ్మూర్తి, మాజీ జడ్పీటీసీ కె.బాలకృష్ణారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వై.చక్రవర్తి, జె.జయరాం, సీహెచ్‌.జోగారావు తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 11:57 PM