Share News

నేటి నుంచి ఏపీ పీజీసెట్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:12 AM

: ఏపీ పీజీసెట్‌-2026 రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూ ల్‌ను కన్వీనర్‌ సి.కృష్ణ బుధవారం విడుదల చేశారు.

నేటి నుంచి ఏపీ పీజీసెట్‌
అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం

రెండో విడత కౌన్సెలింగ్‌

ఎచ్చెర్ల రూరల్‌, అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): ఏపీ పీజీసెట్‌-2026 రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూ ల్‌ను కన్వీనర్‌ సి.కృష్ణ బుధవారం విడుదల చేశారు. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, ఏఫిలియేషన్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల యూనిట్‌గా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. దీనికోసం గురువారం నుంచి ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 12 నుంచి 14 తేదీల మధ్య ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 5న ఆప్షన్లు మార్పుకు అవకాశం ఇచ్చారు. 17న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలలకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌ గత నెలలో పూర్తికాగా, అదే నెల 22 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. వర్సిటీలో 17 పీజీ కోర్సుల్లో 627 సీట్లు ఉండగా, 206 మంది వర్సిటీకి ఆప్షన్లు ఇచ్చుకున్నారు. పీజీ సెట్‌లో ర్యాంకు వచ్చి మొదటి కౌన్సెలింగ్‌కు హాజరు కానివారు రెండోవిడత కౌన్సెలింగ్‌కు రావచ్చు. గతంలో హాజరైన వారు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మార్చుకోవచ్చు, కొత్తరిజస్ట్రేషన్‌, స్లైడింగ్‌ రెండింటికీ అవకాశం ఉంది. మొదటి కౌన్సెలింగ్‌లో బీఆర్‌ఏయూలో ఫిలాషఫీలో జీరో అడ్మిషన్లు జరిగాయి. సోషల్‌ వర్కుకు ఒక విద్యార్థి, అప్లైడ్‌ మ్యాథ్స్‌కు సైతం ఒక విద్యార్థి ఆప్షన్‌ ఇవ్వగా, రిపోర్టు మాత్రం చేయలేదు. మూడు కోర్సుల్లో ప్రస్తుతం ప్రవేశాలు లేవు. మరో పక్క సింగిల్‌ డిజిట్‌ అడ్మిషన్లు జరిగిన ఎంజేఎంసీ, ఎకనామిక్స్‌, మ్యాథ్స్‌, తెలుగు వంటి కోర్సుల్లో రెండో విడత ప్రవేశాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. రెండో కౌన్సెలింగ్‌లో అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు ప్రాధాన్యతనివ్వాలని రిజస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య సూచించారు.

Updated Date - Oct 08 , 2026 | 12:12 AM