Share News

ప్రశాంతంగా ఏపీ ఈసెట్‌

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:11 AM

AP ECET.. 899 people attended పాలిటెక్నిక్‌ డిప్లమో పూర్తిచేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశానికి జిల్లాలోని మూడు కేంద్రాల్లో నిర్వహించిన ఏపీ ఈసెట్‌ గురువారం ప్రశాంతంగా జరిగింది.

ప్రశాంతంగా ఏపీ ఈసెట్‌
ఎచ్చెర్ల: శ్రీవెంకటేశ్వర కళాశాల కేంద్రంలో.. విద్యార్థుల హాల్‌టిక్కెట్లను పరిశీలిస్తున్న సిబ్బంది

899 మంది హాజరు

ఎచ్చెర్ల/నరసన్నపేట, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ డిప్లమో పూర్తిచేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశానికి జిల్లాలోని మూడు కేంద్రాల్లో నిర్వహించిన ఏపీ ఈసెట్‌ గురువారం ప్రశాంతంగా జరిగింది. శ్రీ శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల (చిలకపాలెం), శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల (ఎచ్చెర్ల), కోర్‌ టెక్నాలజీ (నరసన్నపేట) కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో ఈసెట్‌ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించారు. మొత్తం 929 మంది విద్యార్థులకుగానూ 899 మంది హాజరయ్యారు. 30 మంది గైర్హాజరయ్యారు. శ్రీ శివానీలో 389 మంది విద్యార్థులకుగాను 375 మంది, శ్రీ వెంకటేశ్వరలో 200 మంది విద్యార్థులకు 192 మంది హాజరయ్యారు. కోర్‌టెక్నాలజీ కేంద్రంలో 340 మంది విద్యార్థులకుగానూ 332 మంది పరీక్ష రాశారని అధికారులు తెలిపారు.

Updated Date - Apr 24 , 2026 | 12:11 AM