Share News

ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్‌

ABN , Publish Date - May 13 , 2026 | 12:15 AM

EAP set begins ఇంటర్మీడియట్‌ పూర్తయిన విద్యార్థులు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికిగానూ ఏపీ ఈఏపీ సెట్‌ జిల్లాలో నాలుగు కేంద్రాల్లో మంగళవారం ప్రారంభమైంది.

ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్‌
శ్రీశివానీ కళాశాల కేంద్రంలో విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న సిబ్బంది

ఎచ్చెర్ల, మే 12(ఆంరఽధజ్యోతి): ఇంటర్మీడియట్‌ పూర్తయిన విద్యార్థులు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికిగానూ ఏపీ ఈఏపీ సెట్‌ జిల్లాలో నాలుగు కేంద్రాల్లో మంగళవారం ప్రారంభమైంది. జేఎన్‌టీయూ(కాకినాడ) ఆధ్వర్యంలో టీసీఎస్‌ సాంకేతిక సహకారంతో అన్‌లైన్‌లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లాలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల (చిలకపాలెం), శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల (ఎచ్చెర్ల), కోర్‌ టెక్నాలజీ(నరసన్నపేట), ఆదిత్య కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంటు (టెక్కలి)లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌ల్లో పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు ఎంపీసీ స్ట్రీమ్‌లో శ్రీ శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో 400 మంది విద్యార్థులకు 390 మంది, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలలో 180 మందికి 173 మంది పరీక్షకు హాజరయ్యారు. నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీ కేంద్రంలో 200 మంది విద్యార్థులకుగానూ 192 మంది హాజరయ్యారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో ఈ నెల 18 వరకు పరీక్షలు జరుగుతాయి. బైపీసీ స్ట్రీమ్‌లో 19,20 తేదీల్లో నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే చేరుకున్నారు. అభ్యర్థులను నిర్వాహకులు తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లో అనుమతించారు.

Updated Date - May 13 , 2026 | 12:15 AM