ఉపాధి పనులు నిలిపివేయడంపై ఆగ్రహం
ABN , Publish Date - May 06 , 2026 | 12:16 AM
మండల కేంద్రంలోని ఏలూరు రామయ్య చెరువు (శేషయ్య బంద)లో ఉపాధి పనులు నిలిపివేయ డంపై గ్రామానికి చెందిన వేతనదా రులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎంపీడీవో కార్యాలయం వద్ద వేతనదారుల నిరసన
జి.సిగడాం, మే 5 (ఆంధ్ర జ్యోతి): మండల కేంద్రంలోని ఏలూరు రామయ్య చెరువు (శేషయ్య బంద)లో ఉపాధి పనులు నిలిపివేయ డంపై గ్రామానికి చెందిన వేతనదా రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళ వారం ఎంపీడీవో కార్యా లయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ 2008 నుంచి 2018 వరకు సుమారు రూ.1.50 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందని, ఇటీవల తహసీల్దార్ సర్వే చేయించి సదరు చెరువు ప్రభుత్వ పోరం బోకుగా నిర్థారించడంతో సం బంధిత అధికారులు పనులు మంజూరు చేశా రని, అయితే ఇప్పుడు పనులు నిలిపివేయడం ఏమిటని అధికారులను నిలదీశారు. సదరు చెరువులో రెండు వారాలుగా పనులు చేస్తున్నామని, ఆకస్మికంగా నిలిపివేయడంతో తామంతా ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం తగు చర్యలు తీసుకో వాలని కోరారు. అనంతరం ఏపీవో, ఎంపీడీవో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
కబ్జాదారుల నుంచి కాపాడండి
ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈ ఆర్) ఎందువ గ్రామదేవత పండగకు వస్తు న్నారన్న విషయం తెలుసుకున్న సుమారు 100 మంది వేతనదారులు నడిమివలస కూడలి వద్ద ఆయన కారుని ఆపి సమస్యల ను విన్నవించారు. ఏలూరు రామయ్య ఉరఫ్ శేషయ్య బంద ఆక్రమణలు తొలగించి ఉపాధి పనులు చేసుకు నేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యపై ఎమ్మెల్యే స్పందించి వెంటనే కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో ఫోన్‌లో మాట్లాడి ఏలూరు రామయ్య చెరువులో పనులు నిలిపివేశారని, తక్షణం పనులు చేపట్టి ఉపాధి కల్పించాలని కోరారు. తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వేతనదారులు హర్షం వ్యక్తంచేసి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్నం రెండో పూట ఉపాధి పనులను యథావిధిగా చేపట్టారు.