అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:23 AM
అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఏపీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లో గురువారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా నిరసనలు
అరసవల్లి/ఇచ్ఛాపురం/పలాస రూరల్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఏపీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లో గురువారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమం లో ఆ సంఘం అధ్యక్షురాలు కె.కల్యాణి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఎం.గోవర్థన రావు మాట్లాడుతూ.. అంగన్‌వాడీలకు మే నెలలో వేసవి సెలవులు ప్రకటించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, పింఛన్ మంజూరు చేయాల ని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను పెంచాలన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందించా రు. కార్యక్రమాల్లో ఆ సంఘ నేతలు జె.కాంచన, జ్యోతి, పద్మజ, బర్ల హైమ, ఎం.హైమ, బి.సునీత, బి.ఈశ్వరమ్మ, బి.శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.