అ‘పూర్వ’ కలయిక
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:10 AM
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఒకచోట కలిసి సందడి చేశారు.
(ఆంధ్రజ్యోతి బృందం)
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఒకచోట కలిసి సందడి చేశారు. ఆనాటి జ్ఞాపకాలు, నేటి పరిస్థితులను ఒకరికొకరు తెలుపుకుని ఆనందం పొందారు. ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయు లను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఘనంగా రజతోత్సవం
ఆమదాలవలస పట్టణంలోని ఆరో వార్డు తెలగ మన్నయ్యపేట ప్రభుత్వ పాఠశాల రజతోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘జ్ఞాన రజతోత్సవం-గ్రామ అభ్యు దయం’ పేరుతో ఫ్రెండ్స్ యూత్, గ్రామస్థులు నిర్వహించారు. ఉపాధ్యాయులను సత్కరించారు. కూచిపూడి నృత్య ప్రదర్శన, భగవద్గీత శ్లోకాల పారాయణం చేశారు. ‘బాల్య వివాహాలతో అనర్థాలు’ అంశంపై విద్యార్థులు నాటికను ప్రదర్శించారు.