వరుణుని కరుణ కోసం వరద పాయసం
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:22 AM
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరాలయం క్షేత్ర పాలకుడు పద్మనాభ స్వామి కొండపై అర్చకులు గురువారం వర్షాలు కురవాలని కోరుతూ వరద పాయసం పోశారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినపుడు వరుణి దేవుని కరుణ కోసం పద్మనాభ స్వామి కొండపై వరదపాయసం పోయడం ఆనవాయితీ.
జలుమూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరాలయం క్షేత్ర పాలకుడు పద్మనాభ స్వామి కొండపై అర్చకులు గురువారం వర్షాలు కురవాలని కోరుతూ వరద పాయసం పోశారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినపుడు వరుణి దేవుని కరుణ కోసం పద్మనాభ స్వామి కొండపై వరదపాయసం పోయడం ఆనవాయితీ. ఆలయ అర్చకులు ముందుగా పద్మనాభస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం బియ్యం, బెల్లంతో తయారుచేసి వరద సాయసం పోశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఎస్.వి.చలం, శివ, అప్పారావు, సింహాచలం, ధనుంజయ, అచ్యుతరావ పాల్గొన్నారు.
నేడు వరుణ జపం
పాతపట్నం, జూలై 23(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీనీలమణిదుర్గ ఆలయంలో శుక్రవారం వరుణ జపం- రుద్రహోమాలు నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి టి .వాసుదేవరావు తెలిపారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వర్షాల కోసం వరుణ జపం- రుద్ర హోమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ పాలక మండలి చైర్మన్ అక్కంద్ర సన్యాసిరావు కోరారు.