Share News

గంటన్నరపాటు నరకయాతన

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:03 AM

నరసన్నపేట బైపాస్‌ రోడ్డులో జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఆగిఉన్న వ్యాన్‌ను వెనుకభాగం నుంచిఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌, సహాయకుడు గంటన్నరపాటు నరకయాతన అనుభవించారు. ముందుభాగంలో ఇరుక్కున్న వారిని అతి కష్టం మీద బయటకు తీసి నరసన్నపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

   గంటన్నరపాటు నరకయాతన
ఆటోలో చిక్కుకుపోయిన శ్రవణ్‌, వెంకటరమణ

నరసన్నపేట, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట బైపాస్‌ రోడ్డులో జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఆగిఉన్న వ్యాన్‌ను వెనుకభాగం నుంచిఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌, సహాయకుడు గంటన్నరపాటు నరకయాతన అనుభవించారు. ముందుభాగంలో ఇరుక్కున్న వారిని అతి కష్టం మీద బయటకు తీసి నరసన్నపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు కథనం మేరకు.. విజయనగరం జిల్లాలోని జామి నుంచి బూడిద గుమ్మడికాయిలను ఆటోలో టెక్కలి తీసుకువెళ్తున్నారు. ఆ సమయంలో ఆటో జాతీయరహదారిపై జమ్ముజంక్షన్‌కు సమీపంలో ప్లైఓవర్‌ వంతెనపై ఆగిఉన్న వ్యాన్‌ను వెనుకభాగంలోఢీకొంది. దీంతో ఆటో ముందుభాగం నుజ్జునుజ్జు కాగా ఆటో డ్రైవర్‌ శ్రవణ్‌కుమార్‌, సహాయకుడు వెంకటరమణ అందులో చిక్కుకున్నరు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ గణేష్‌, పోలీసుపెట్రోలింగ్‌ వాహన సిబ్బంది చేరుకున్నారు. ముందుభాగంలో ఇరుక్కున్న డ్రైవర్‌, సహాయకుడిని బయటకు తీసేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఆటో ముందుభాగం నుజ్జుకావడంతో అతి కష్టం మీద బయటకు తీసి నరసన్నపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సకాలంలో పోలీసులు చేరుకొని బాధితులను ప్రమాదం నుంచి రక్షించడంతో తప్పించడంతో స్థానికుల అభినందించారు. ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ గణేష్‌ తెలిపారు.

Updated Date - Aug 26 , 2026 | 12:03 AM